![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -272 లో.. అరుణ్ ని కావ్య పట్టుకోవాలని ఒక బోర్డుపై ప్లాన్ గీస్తూ ఉంటుంది. అది చూసిన రాజ్.. ఏంటి ఇలా చేస్తున్నావంటూ చిరాకు పడుతుంటాడు. ఆ తర్వాత ఇద్దరు కాసేపు గొడవపడతారు.
మరొకవైపు అప్పుకి కళ్యాణ్ ఫోన్ చేస్తుంటే కట్ చేస్తుంటుంది. ఏంటి గుడ్ న్యూస్ చెప్పడానికి నేను ఫోన్ చేస్తుంటే ఇలా చేస్తుందని కళ్యాణ్ అనుకుంటాడు. అప్పుడే అటుగా వస్తున్నా కనకాన్ని చూసి టైమ్ వచ్చారని కళ్యాణ్ అంటాడు. అప్పుకి గుడ్ న్యూస్ చెప్పడానికి ఫోన్ చేస్తుంటే తను కట్ చేస్తుందని కళ్యాణ్ అంటాడు. గుడ్ న్యూస్ ఏంటని కనకం అనగానే రేపు ముహూర్తం ఫిక్స్ చేస్తున్నారు కదా అని అనగానే.. నేను చెప్పాను వస్తుందని కనకం అంటుంది. అది విని కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు కనకం తన గదిలోకి వస్తుందని రుద్రాణి తన గదికి లాక్ వేసి బాల్కనీలోకి వెళ్తుంది. ఆ తర్వాత కనకానికి రుద్రాణి ప్లాన్ అర్థం అయి కనకం పిన్ తో లాక్ తీసి గదిలోకి వెళ్తుంది. ఆ తర్వాత రుద్రాణి వచ్చేసరికి తన నైటీ వేసుకొని ఉంటుంది కనకం. దాంతో రుద్రాణికి కోపం వస్తుంది. ఇద్దరు కాసేపు వాదించుకుంటారు. మరుసటి రోజు ఉదయం రాజ్ దగ్గరికి ఇందిరాదేవీ వచ్చి పంతులు గారు వస్తున్నారా అని అడుగుతుంది. మరోవైపు కనకానికి అప్పు ఫోన్ చేసి.. ఇంటి బయటకు వచ్చానని చెప్పగానే కనకం వెళ్లి తనని లోపలికి రమ్మని చెప్తుంది. కానీ అప్పు రాదు.
కాసేపటికి కళ్యాణ్ వచ్చి అప్పుని లోపలికి తీసుకొని వస్తాడు. ఆ తర్వాత పంతులు గారు దుగ్గిరాల ఇంటికి రాగానే మళ్ళీ కనకం నేను చెప్పినట్టు చెప్పండి అని బ్లాక్ మెయిల్ చేస్తుంది. అనామిక పేరెంట్స్ ఒక వైపు, దుగ్గిరాల కుటుంబం మరోవైపు ఇలా అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. కనకం చెప్పినట్టు అబ్బాయి జాతకం బాగుంది కానీ అమ్మాయి జాతకం బాలేదని పంతులు చెప్పగానే అందరు షాక్ అవుతారు. తరువాయి భాగంలో.. ఇన్ని అనర్థాలు జరిగే కంటే పెళ్లి ఆపడం మంచిది అని ధాన్యలక్ష్మి అనగానే.. కళ్యాణ్ కోపంగా అక్కడి నుండి వెళ్తుంటాడు. ఇక రాజ్ కావ్య అతడిని ఆపుతారు. మా పెళ్లి ఏమైనా అనుకొని జరిగిందా? మేం ఎంత హ్యాపీగా ఉంటున్నాం. ట్రావెల్ ఏజెన్సీ లో హానీమున్ ప్యాకేజీ కోసం ప్లాన్ చేశారని కావ్య అనగానే.. అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |